![]() |
![]() |

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హోస్ట్ నందు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాడు. ఇద్దరి జర్నీ ఇక్కడితో ఎండ్ కాబోతోంది అని చెప్పాడు. ఇందులో అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స లు ఇచ్చారు. ఇక ఢీ 10 రాజు ఒక బిడ్డను పట్టుకుని చేసిన ఒక యాక్ట్ అందరినీ కదిలించింది. "నల్లని వన్నీపాలని" అనే పాటకు లేడీ గెటప్ లో ఒక తల్లిగా నటిస్తూ డాన్స్ చేసాడు. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు "కింగ్ ఆఫ్ ఢీ అన్నది" అంటూ విజయ్ బిన్నీ మాస్టర్ రాజుని బాగా మెచ్చుకున్నాడు. "పేరెంట్స్ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారు అన్నది చాలాచాలా బాగా చూపించారు చిట్టి మాస్టర్ " అంటూ చెప్పారు విజయ్ బిన్నీ మాస్టర్. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వాళ్ళ ఫామిలీని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు.
వాళ్ళ అబ్బాయి వియాన్ష్ ని తీసుకొచ్చి "హ్యాపీ బర్త్ డే" సాంగ్ పాడించారు. ఆ తర్వాత విజయ్ బిన్నీ మాష్టర్ తన బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ పిల్లాడు ఎమోషనల్ ఐపోయాడు. "నీకు ఢీలో ఎవరంటే ఇష్టం" అని అడిగేసరికి "పండు అంటే ఇష్టం" అని చెప్పాడు. "స్కూల్ కి వెళ్లకపోతే ఏమవుతారు" అంటే "ఫెయిల్" అని చెప్పాడు. ఇక తర్వాత హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇక అసలైన పండు మాస్టర్ వచ్చేసాడు. "సిరిసిల్ల ఎళ్లినాడు..సీరాలెన్నో తెచ్చినాడు" అంటూ లేడీ గెటప్ లో చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే పండూ అంటూ గట్టిగా అరిచి లేడీ గెటప్ ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు. అంతే పండు సిగ్గుపడిపోయాడు. "వాడికి అమ్మ లేదు కదా మాస్టర్ ఢీ షోనే అమ్మల భావిస్తాడు. ఇక లాస్ట్ లో నందు "అరె వియాన్ష్ ఈ సాలా కప్పు" అనేసరికి "లాలీపాప్" అంటూ వేలు చూపించాడు. దాంతో అందరూ నవ్వేశారు.
![]() |
![]() |